News

TELANGANA

కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత..!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.   బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్..! అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది..?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది.   “పార్టీ ఎమ్మెల్సీ…

AP

ఎటుచూసినా అమరావతి ఆకర్షణీయంగా ఉండాలి: సీఆర్డీఏకి చంద్రబాబు దిశానిర్దేశం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాజధానిలో చేపట్టాల్సిన ప్రధాన ప్రాజెక్టులను సకాలంలో, పూర్తిచేయడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని (స్పెషల్ పర్పస్ వెహికల్ – ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 52వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. మొత్తం 7 కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి,…

National

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.   గతంలో భారత్‌కు వచ్చి గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు, హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన…

AP

బీఆర్ఎస్ కు పట్టిన గతే జనసేనకు పడుతుంది!: సీపీఐ నారాయణ హెచ్చరిక..

బీజేపీతో జతకట్టే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బీజేపీ అందించేది అభయహస్తం కాదని, అది పార్టీలను నాశనం చేసే ‘భస్మాసుర హస్తం’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.   ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, వాటిలో చీలికలు తీసుకురావడమే బీజేపీ వ్యూహమని నారాయణ ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. బీజేపీకి…

National

ఎస్‌సీఓ వేదికగా ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు..

‘షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశంలో ఉండగానే, ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతునిస్తున్న కొన్ని దేశాల ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని గుర్తుచేస్తూ, ఇలాంటి చర్యలను ప్రపంచ సమాజం అంగీకరించాలా? అని సూటిగా ప్రశ్నించారు.   సోమవారం టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు ప్రారంభోపన్యాసంలో మోదీ మాట్లాడారు.…

TELANGANA

కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ..

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టడానికి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది.   ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. రేపు ఉదయం…

National

యుద్ధం ముగియాలి.. శాంతి నెలకొనాలి: పుతిన్‌తో భేటీలో మోదీ..

ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని మరోసారి ప్రపంచ వేదికపై స్పష్టం చేశారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అన్నారు. చైనాలోని తియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా సోమవారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.   ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “యుక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఇటీవల జరుగుతున్న ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. ఇందులో భాగస్వాములైన అన్ని…

TELANGANA

చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా… తెలుగువాడికి అవకాశం వచ్చింది: రేవంత్ రెడ్డి..

ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి” అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  …

AP

భవిష్యత్తును ఊహించి ముందుకెళ్లే దార్శనికుడు సీఎం చంద్రబాబు: పవన్ కల్యాణ్..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం అని కొనియాడారు.   “భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం…