News

CINEMA

‘బిగ్ బాస్ సీజన్ 9’ అఫీషియ‌ల్‌ లాంచింగ్ డేట్ వ‌చ్చేసింది..

తెలుగు టెలివిజన్ చరిత్రలో సరికొత్త ప్రయోగానికి బిగ్ బాస్ సిద్ధమైంది. ఈసారి ఒకే ఇంట్లో కాకుండా, ఏకంగా రెండు ఇళ్లలో ఈ రియాలిటీ షో సందడి చేయనుంది. ‘సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు’ అనే వినూత్న థీమ్‌తో బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రోమో విడుదల చేయడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి.   అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ తొమ్మిదో సీజన్, సెప్టెంబర్ 7వ తేదీ…

NationalTechnology

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’.. హైదరాబాద్ నుంచీ వీక్షించే అవకాశం..

ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో ఆకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది.…

TELANGANA

తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సర్వీసు పొడిగింపు..

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. పదవీ విరమణ చేయవలసి ఉండగా, ఆయన సర్వీసును పొడిగించాలని డీవోపీటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.   రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఏడు నెలల పాటు రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో 2026 మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ…

AP

ఏపీలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం..! ఏపీలో కొలువుల జాతర..!

ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ వేగంగా పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక…

APSPORTS

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.   చాలాకాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు విడుదల కావడంతో క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్‌) ఛైర్మన్‌ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు,…

AP

ఏపీలో ఇక ప్రతి ఇంటికి ఫ్యామిలీ కార్డు..! ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పంపిణీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు ‘ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌’ వ్యవస్థపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.   ఈ కొత్త ఫ్యామిలీ కార్డులో ఆ…

TELANGANA

వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు..: హరీష్ రావు..

రాష్ట్రంలో వరదలతో ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా” సీఎం తీరు ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒకవైపు ప్రజలు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతుంటే, సీఎం మాత్రం మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ నిర్వహణపై సమీక్షలు చేయడం దారుణమని అన్నారు.మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందంతో కలిసి…

National

చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం..

భారత్, చైనా సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది. సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో 2020లో జరిగిన ఘర్షణల అనంతరం, ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఈ కీలక భేటీ ఆదివారం జరగనుంది.   జపాన్ లో త‌న‌ రెండు రోజుల పర్యటన ముగించుకుని…

TELANGANA

కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం.. గ్రామాలకు గ్రామాలే ఖాళీ..!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.   డోంగ్లి మండలంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సిర్పూర్, పెద్దటాక్లి, హాసన్‌ టాక్లి గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో…

National

కర్ణాటకలో వింత.. నీలం రంగు గుడ్డు పెట్టిన నాటు కోడి..!

కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన ఓ విచిత్ర సంఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దావణగెరె జిల్లా, చన్నగిరి తాలూకాలోని నల్లూరు గ్రామంలో ఓ సాధారణ నాటు కోడి నీలం రంగులో ఉన్న గుడ్డు పెట్టడమే ఈ ఆశ్చర్యానికి కారణం. ఈ వింత గుడ్డును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.   వివరాల్లోకి వెళితే.. నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే రైతు జీవనోపాధి కోసం పది నాటు కోళ్లను పెంచుకుంటున్నాడు.…