ఫాస్టాగ్ వన్ ఇయర్ పాస్… వివరాలు ఇవిగో..!
వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక శుభవార్త అందించింది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పథకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి పదేపదే రీఛార్జ్ చేసుకునే శ్రమను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ వార్షిక పాస్ ధరను రూ. 3,000గా నిర్ణయించారు.…