నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16… విజయవంతంగా కక్ష్యలోకి ‘నైసార్’..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ ఉపగ్రహాన్ని మోసుకుంటూ, భారత వాహన నౌక జీఎస్ఎల్వీ-ఎఫ్16 నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్ ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ ఉపగ్రహం బరువు 2,393 కిలోలు. నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్…

