విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..
విశాఖపట్నం, విజయవాడ మెట్రో మొదటి దశ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు ముఖ్య నగరాల మెట్రో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. మెట్రో ప్రాజెక్టు, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై కన్సల్టెన్సీలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు…

