News

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

బీజేపీలో కుల రాజకీయాలకు తావులేదని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా ఆసక్తికరంగా స్పందించారు.   బీజేపీలో కుల రాజకీయాలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారని గుర్తు చేశారు. ఆయన తర్వాత కూడా…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ..! కారణం అదేనా..?

2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసును సీబీఐ చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు ఓ కొలిక్కిరాలేదు. తన తండ్రి హంతకులకు శిక్ష పడేందుకు వివేకా కుమార్తె వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.   తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 సెప్టెంబరులో కూడా సునీత, తన భర్తతో…

AP

వైసీపీ నేత పెద్దిరెడ్డిని కలవడంపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివరణ..! ఏమన్నారంటే..?

టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎయిర్ పోర్టులో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వైసీపీలో చేరుతున్నారా? అనే కోణంలో చర్చ జరిగింది. దీనిపై కొలికపూడి వివరణ ఇచ్చారు. ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తాము హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చామని, ఆ సందర్భంగా అదే ఇండిగో విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం కూడా ప్రయాణించిందని వెల్లడించారు. దాంతో మర్యాదపూర్వకంగా, బాగున్నారా సార్ అని పలకరించానని,…

National

పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌..

భారత్ తన గగనతలాన్ని ఉపయోగించి పాకిస్థాన్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 23 వరకు పాక్‌ విమానాలు భార‌త‌ గగనతలంలోకి ప్రవేశించకుండా బ్యాన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.   “పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తున్న ఎయిర్‌మెన్ నోటీసు (NOTAM)ను అధికారికంగా ఆగస్టు 23 వరకు పొడిగించడం జ‌రిగింది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళుతున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యంగ్యం ప్రదర్శించారు.   ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని…

TELANGANA

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి అరుదైన ఘనత..!

హైదరాబాద్‌లోని నిమ్స్ యూరాలజీ విభాగం అరుదైన రికార్డును నెలకొల్పింది. గత ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి అవసరమైన వారికి నిమ్స్ ఆశాదీపంలా కనిపిస్తోంది.   2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. డా. రామ్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి…

TELANGANA

జీమెయిల్ లో కొత్త ఫీచర్..? ఇక ఆ మెయిల్స్‌కు చెక్..!

గూగుల్ తన జీమెయిల్ లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని పేరు ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌లో అవసరం లేని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.   ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?   ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’ డాష్‌బోర్డ్ ద్వారా వినియోగదారులు తాము సబ్‌స్క్రైబ్ చేసుకున్న అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను ఒకే చోట చూడవచ్చు. ఈ డాష్‌బోర్డ్‌లో మీకు అవసరం లేని మెయిల్స్‌ను గుర్తించి, వాటి పక్కన…

AP

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం… కీలక నిర్ణయాలు ఇవిగో..!

టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. శ్రీ వారి భక్తులకు సేవలను మరింతగా పటిష్ఠం చేయటం పైన చర్చించారు. భక్తులకు వసతి పెంపు తో పాటుగా సీఎం ఆదేశాల మేరకు శ్రీవారి సేవా విధానంలో మార్పుల దిశగా కసరత్తు చేస్తున్నారు. అలిపిరి వద్ద మౌలిక వసతులతో పాటుగా.. వసతి గురించి సమావేశంలో చర్చ జరిగింది. పెరుగు తున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పై బోర్డు…

AP

ఏపీ మామిడి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనతో తోతాపురి మామిడి రైతుల కష్టాలపై మొదలైన చర్చకు కేంద్రం ముగింపు పలికింది. తోతాపురి రైతులకు మద్దతు ధర విషయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం దీనికి ఓ పరిష్కారం చూపింది. తోతాపురి మామిడి పళ్లకు మద్దతు ధరను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయాల సంగతి ఎలా ఉన్నా రైతులకు మాత్రం ఊరట లభించనుంది.   ఈ ఏడాది తోతాపురి మామిడికి…

National

యూపీఐ లావాదేవీల్లో భార‌త్ టాప్: ఐఎంఎఫ్‌..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల్లో ప్ర‌పంచంలోనే భార‌త్ టాప్‌గా నిలిచింద‌ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. ‘గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ’ పేరిట‌ ఐఎంఎఫ్‌ ఇటీవల విడుదల చేసిన నోట్ ప్రకారం యూపీఐ వేగవంతమైన వృద్ధి కారణంగా భారత్‌ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేడు మ‌న దేశంలో ప్ర‌తి నెలా 1800 కోట్ల‌కు పైగా యూపీఐ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని ఐఎంఎఫ్ పేర్కొంది.  …