విశాఖను ముంచెత్తిన వాన.. జీవీఎంసీ హై అలర్ట్..
సాగర నగరం విశాఖపట్నాన్ని ఆదివారం భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గాజువాక, పెద్ద గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా గాజువాకలోని డైరీ కాలనీ, హెచ్‌బీ కాలనీ, రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు…

