ట్రంప్‌పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన రాజ్‌నాథ్ సింగ్..
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన నేపథ్యంలో, కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. “కొందరు ‘బాస్’లు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనమే అందరికీ బాస్ అయితే, భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని వారు అనుకుంటున్నారు?” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.…

