ఏపీలో రూ. 1.01 లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం: విశాఖ, అమరావతి, తిరుపతి మెగా సిటీలుగా అభివృద్ధి!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ. 1,01,899 కోట్ల విలువైన 26 పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయబడింది. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టులు కేవలం ఆమోదం పొందితే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా (గ్రౌండ్ అయ్యేలా)…

