విశాఖకు త్వరలో గూగుల్… సీఎం చంద్రబాబు ప్రకటన..!
అమరావతిలోని విట్ యూనివర్సిటీలో ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన భవనాలు ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ,…