AP

AP

చొక్కా మడతేయండి, “సైకిల్” బయట..”గ్లాస్” షింకులో వేయాలి – జగన్ గర్జన..!

వైసీపీ రాపప్తాడు సిద్దం సభకు జనం హోరెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తన పాలనలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలన్నారు. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని పేర్కొన్నారు. తాగేసిన టీ ట్లాస్ షింక్ లోనే ఉండాలంటూ టీడీపీ, జనసేన గుర్తుల గురించి వివరించారు. మరోసారి చొక్కా మడతేయటానికి సిద్దమా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుర్చీలు మడతేసి..చీపుర్లతో ఊడ్చి వారిని మరోసారి ఇంటికి పంపిద్దామంటూ జగన్ పిలుపునిచ్చారు.   జగన్ వ్యాఖ్యలు…

AP

ఏపీ రాజకీయాలపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు, జగన్‌పై ఇలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని.. ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని అన్నారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని విమర్శించారు.   రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్…

APNational

ఇస్రో మరో సక్సెస్- శ్రీహరికోట నుంచి నింగికి వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో కీర్తికిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్ధితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.   భూఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో…

AP

వైసీపీ భూస్థాపితం.. తొక్కుకుని వెళ్తామని చంద్రబాబు హెచ్చరిక..

వచ్చే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదిలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు…

AP

వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన సీమ సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.   ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు.…

AP

అమిత్ షా – చంద్రబాబు భేటీ అందుకే తేల్చేసిన పురందేశ్వరి..!!

ఏపీలో ఎన్నికల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత వారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో, టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ, రెండు పార్టీల నుంచి పొత్తుల పైన అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల పైన వేచి చూసే ధోరణిపైన టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో అసలు అమిత్ షా…

AP

కుర్చీలు మడతపెడతారు, ఖబడ్దార్ – చంద్రబాబు మాస్ వార్నింగ్..!!

సీఎం జగన్ , టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ లు ఇచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల యుద్దంలో కార్యకర్తలు చొక్కాలు మడత పెట్టాలని జగన్ పిలుపునిస్తే…టీడీపీ – జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతబెడతారని చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైపోయిందని విమర్శించారు. జగన్ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.   ఎన్నికల వేళ సీఎం జగన్ – చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసగుతోంది. తాజాగా వాలంటీర్ల…

AP

టీడీపీకీ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఏపీలో ఎణ్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలకు రాజీనామాలు.. నేతల పార్టీల మార్పులు తారా స్థాయికి చేరాయి. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే సంకేతాలు ఉన్నా అధికారిక నిర్ణయంతో అనిశ్చితి కొనసాగుతోంది. ఇదే సమయంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలో సీనియర్లు పార్టీ వీడుతున్నారు. తాజాగా టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర దేవ్ రాజీనామా చేసారు.   టీడీపీకి రాజీనామా:…

AP

ఏపీకి ప్రధాని మోదీ, కీలక నిర్ణయం..

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ దాదాపు ఖాయమైనా…అధికారిక నిర్ణయం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి.   ఏపీకి ప్రధాని మోదీ:…

AP

దూకుడు పెంచిన షర్మిల..

పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చెప్పట్టిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. ఏపీకి నియంత పాలన నుంచి విముక్తి కల్పించడమే తన లక్ష్యమంటున్న షర్మిలపై.. వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా మంత్రి రోజా ఆమెపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలకు షర్మిల గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ నుండి రోజుకో జోకర్ మాట్లాడుతున్నారంటున్న షర్మిల.. నగరి…