AP

APTELANGANA

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

AP

226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు నడిచిన లోకేష్..

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.2,029 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లోకేష్ సమస్యలను తెలుసుకున్నారు. గ్రేటర్ విశాఖ శివాజీ…

AP

టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై..

తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్…

AP

సన్నాసి, కుల గుల.. రామోజీపై పోసాని సంచలన ఆరోపణ..

ఏపీలో ఎన్నికలవేళ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఎన్నికల సమయంలో సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలుంటాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా ఈసారి ఓ పత్రికాధిపతిని వైసిపి నాయకులు టార్గెట్ చేసుకున్నారు. అయితే ఆ పత్రికాధిపతి సామాజిక వర్గానికి చెందిన వారే ఆయనను విమర్శిస్తున్నారు. కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటే ఏపీలో.. ఆ కులం పేరుతోనే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పైగా ఆ పత్రికాధిపతి చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఓ వైసిపి…

APTELANGANA

పవన్ కళ్యాణ్ పై బర్రెలక్క హాట్ కామెంట్స్..

ఏపీ సీఎం జగన్ ఆ తరహా ఆరోపణలు చేసేసరికి జనసేన సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2014 తెలంగాణ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వైసీపీ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్లను గణాంకాలతో సహా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.   అయితే తాజాగా ఈ ఘటనపై బర్రెలక్క స్పందించారు. ఓ ప్రైవేటు…

AP

జగన్ పై రెడ్డి సామాజిక వర్గం గుర్రు..

  వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీ వెంట నడుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ విభేదించారు. అటు జగన్కు సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఒప్పుకోకపోవడంతో జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆ సమయంలో రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది. జగన్కు అండగా నిలబడింది. చాలామంది మంత్రులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు. జగన్…

AP

పండగ తరువాతే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు..

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదు. మిగతా కేసుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పులే దీనిని తెలియజేస్తున్నాయి. అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు.. సుదీర్ఘ విరామం తర్వాత బెయిల్ లభించింది. అయితే తన కేసుల విషయంలో నిబంధనలు పాటించలేదని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. అందుకే ఆ కేసులను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు…

AP

టీడీపీ సీనియర్ల సీట్ల మార్పు, ఎవరెక్కడ – చంద్రబాబు మార్క్ ఎంపిక..!!

ఏపీలో ఎన్నికల రాజకీయ వేడెక్కుతోంది. సీట్ల ఖరారు పైన టీడీపీ, వైసీపీలో సెగ మొదలైంది. వైసీపీలో భారీగా సిట్టింగ్ లను సీఎం జగన్ మారుస్తున్నారు. అటు టీడీపీ, జనసేన పొత్తుతో ఎవరికి సీట్లు వస్తాయనేది ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, కొందరికి సీట్లు మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురి సీట్ల విషయంలోనూ నిర్ణయానికి వచ్చారు.   అభ్యర్దుల…

AP

యువ సైన్యాన్ని సిద్ధం చేసుకున్న జగన్: సారథిగా బైరెడ్డి

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.   ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల…

AP

రాజీనామాల వేళ.. జగన్ మెరుపు నిర్ణయం: సిట్టింగ్ ఎమ్మెల్యేకు నో టికెట్: కొత్త ఇన్‌ఛార్జీ నియామకం..

గ్రేటర్ విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి (Tippala Devan Reddy) రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తోన్నట్లు తెలిపారు.   సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడే దేవన్ రెడ్డి. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పవన్ కల్యాణ్‌నే మట్టి కరిపించిన పేరును సాధించారు నాగిరెడ్డి. భారీ మెజారిటీతో పవన్‌ను ఓడించి, జెయింట్…