గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం..
టీడీపీకి ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాకిచ్చారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమర్పించిన రాజీనామాను ఇవాళ ఆమోదించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గంటా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా రాజీనామా సమర్పించి మూడేళ్లు కావస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం విశేషం. విశాఖ ఉత్తరం సీటు…

