AP

APPOLITICSTELANGANA

YS షర్మిలకి బెయిల్.!

ఉదయం నుంచీ హైడ్రామా నడిచింది. వైఎస్ షర్మిల, పోలీసుల కంట పడకుండా సొంత వాహనంలో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్ళగా, అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వాహనం దిగేందుకు నిరాకరించిన షర్మిలను, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సాయంత్రం వైఎస్ షర్మిల సహా, ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు, వైఎస్ షర్మిల సహా ఇతర నిందితులకు…

APPOLITICSTELANGANA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ సొంత బాబాయ్ కేసును ఇతర రాష్ట్రానికి వెళ్లడం సిగ్గచేటని అన్నారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మృతుడి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు…

APPOLITICSTELANGANA

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి జరిగింది. నర్సంపేటలో వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతుండగా, పాదయాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. వైఎస్ షర్మిల పాదయాత్ర వెంట వచ్చిన, బస్సుని కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. పదే…

AP

అమరావతి రైతులకు చుక్కెదురు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ దానిపై మధ్యంతర స్టే విధించింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని, ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి…

AP

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు…..

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలపై విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు…… మున్సిపల్ పరిధిలో 18 వార్డులు ఉండగా, చెత్త సేకరణ కోసం 16 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసి రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 16 మంది డ్రైవర్లను చేర్చుకున్నారు…….. 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

AP

రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర

  రైతుల ఆశలపై కురిసిన వర్షపునీరు తడి ఆరని కళ్ళతో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్న అన్న దాతలు కళ్లాల్లోనే ధాన్యం కన్నీళ్ళ మధ్య రైతులు రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర 200 రూపాయలు తక్కువైనా ఇచ్చి పచ్చి ధాన్యం కనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.ఈ ఆందోళనలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొని మద్దతు తెలిపారు.దేశానికి రైతు…

AP

కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ : ది.25-11-2022(శుక్రవారం) .. కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఖర్చును వెతించి, పేద మధ్యతరగతి పిల్లగాలకు విలువైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు కు అందరికీ మంచి పోషక విలువ గల ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు, ఎంపీపీ…

AP

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన…

AP

చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు

ఏలూరు జిల్లా :  చింతలపూడి నియోజకవర్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం(B) చింతలపూడి వసతి భవనం సరిపోక రాత్రిపూట ఆరు బయట నిద్రపోతున్న విద్యార్థులు౼ ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అదేశాలు మేరకు ఏలూరు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థి సంక్షేమ హాస్టల్ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు చింతలపూడి నియోజవర్గంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (B) చింతలపూడిలో పరిశీలనకు వెళ్లడం జరిగింది.…

AP

నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం

నెల్లూరు కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐతో విచారణకు హైకోర్టు ఆదేశించింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టులో ముఖ్యమైన ఫైళ్లు మాయమైన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధి కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలు కనిపించలేదు. గత ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో కోర్టులో దొంగతనాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు కోర్టు కాంప్లెక్స్‌లోని 4వ అదనపు జ్యుడీషియల్…