సంచలన పరిణామం… మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ఓ కీలక తీర్మానం సభలో సంచలనం సృష్టించగా, ప్రతిపక్ష వైసీపీని ఇరకాటంలో పడేసింది. అనూహ్యంగా, ఆ తీర్మానానికి వైసీపీ మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్…