AP

AP

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..! వాటిపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని, ఇందుకుగాను రూ. 86,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనుందని ప్రధానికి వివరించారు.   ఈ చారిత్రాత్మక పెట్టుబడికి సంబంధించి మంగళవారం ఢిల్లీలోనే గూగుల్ ప్రతినిధులతో…

AP

విశాఖలో గూగుల్ ఏఐ హబ్… రేపు ఢిల్లీలో చారిత్రాత్మక ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)…

AP

కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గం అజెండా అంశాల తర్వాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని.. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల సంస్థల రాకతో.. ఐటీ హబ్‌గా ఏపీ మారబోతోందని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థల నెలకొల్పేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కార్ పెట్టుబడులు తెస్తోందని సీఎం…

AP

AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు..

ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది ఆర్టిఫిషియలో తెలియడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి…ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగ తెలంగాణ టీడీపీ నేతలను గర్తుతెలియని వ్యక్తి మోసం చేశారు.   తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా గత…

AP

అలాంటి పనులు చెయ్యను.. అలా అయితే రాజకీయాలు వదిలేస్తా.. పవన్ సంచలన వ్యాఖ్యలు..

ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున రూ.90 లక్షల బీమా అందించారు.   ఉప్పాడ మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై వారంలోగా నివేదిక ఇవ్వాలని…

AP

అధికారంలో ఉన్నా, లేకున్నా స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతాం: జగన్..

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్మికుల పక్షానే నిలబడతామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడమే తమ ఏకైక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం నర్సీపట్నం, విశాఖపట్నం పర్యటనలో భాగంగా తనను కలిసిన ఉక్కు పరిశ్రమ ఉద్యోగులకు జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారు.   పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జగన్‌ను కలిసి,…

AP

పాడి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! పశుగ్రాసం సాగుకు 100% రాయితీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాడి రైతులకు అవసరమయ్యే పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 శాతం రాయితీతో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పశుగ్రాసం సాగుకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.

AP

రోడ్ల మరమ్మత్తులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 274 రహదారుల మరమ్మత్తుల కోసం తాజాగా ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రహదారుల్లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.   అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వ…

AP

పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం..! కృష్ణా జిల్లాలో పుట్టిన తొలి టెస్ట్ ట్యూబ్ దూడ..

పశుసంవర్థక రంగంలో ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) టెక్నాలజీ ద్వారా ఓ కోడెదూడ జన్మించింది. మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పశువైద్య అధికారులు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దేశీయ గో జాతులను అభివృద్ధి చేసి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.   ప్రయోగం జరిగిందిలా.. పశుగణాభివృద్ధి విభాగం అధికారులు గుంటూరు లాంఫాంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.…

AP

టాటా గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ..!

టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి నారా లోకేశ్ సోమవారం ముంబయిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా గ్రూప్స్ లో పలు కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో ఈ నెలలో జరిగే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.   టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేశ్…