రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి.. నేడు 16 వేల మందికి నియామక పత్రాలు..
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన వేగంతో, కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి అమరావతిలోని సచివాలయం సమీపంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ బడుల్లో త్వరలో విధుల్లో చేరనున్న కొత్త ఉపాధ్యాయులతో రాష్ట్రంలో కొలువుల పండుగ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

