AP

AP

భవిష్యత్తును ఊహించి ముందుకెళ్లే దార్శనికుడు సీఎం చంద్రబాబు: పవన్ కల్యాణ్..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. చంద్రబాబు దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చిరస్మరణీయం అని కొనియాడారు.   “భవిష్యత్తును ఊహించి ప్రణాళికబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం…

AP

కూటమి 15 ఏళ్లు కొనసాగాలి… జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన పవన్..!

ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక విజయం తర్వాత జనసేన పార్టీ భవిష్యత్ ప్రయాణంపై ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాబోయే దశాబ్దకాలానికి యువ నాయకత్వాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా కీలక కార్యాచరణను ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి సుస్థిర పాలన అందించేందుకు ప్రస్తుత ఎన్డీయే కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఈ…

AP

రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు: సీఎం చంద్రబాబు..

“రాష్ట్ర అభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా తయారయ్యారు. ప్రతి మంచి పనికీ తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీ పడాలి తప్ప, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం సరికాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల కుప్పం ప్రజల కలను సాకారం చేస్తూ, హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకువచ్చిన చారిత్రక సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు…

AP

కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్..! కుప్పం అభివృద్ధికి 6 కీలక ఎంవోయూలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనుంది. పారిశ్రామికంగా కుప్పం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఏకంగా విమానాలు, రాకెట్ల తయారీ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఫైబర్ బోర్డు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కుప్పం పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలతో మొత్తం 6 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలోకి రూ. 2,050 కోట్లకు…

AP

ఏపీలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం..! ఏపీలో కొలువుల జాతర..!

ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ వేగంగా పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక…

APSPORTS

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.   చాలాకాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు విడుదల కావడంతో క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్‌) ఛైర్మన్‌ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు,…

AP

ఏపీలో ఇక ప్రతి ఇంటికి ఫ్యామిలీ కార్డు..! ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పంపిణీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు ‘ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌’ వ్యవస్థపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.   ఈ కొత్త ఫ్యామిలీ కార్డులో ఆ…

AP

అటవీశాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి… పవన్ కల్యాణ్ ఫైర్..!

ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   “శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి…

AP

కోవూరు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ‌..!

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డికి బెదిరింపు లేఖ రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్య‌క్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇంటికి వ‌చ్చాడు. అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అనంత‌రం కార్యాల‌యం సిబ్బంది స‌ద‌రు వ్య‌క్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖ‌ను తెరిచి చూశారు.   ఆ లేఖ‌లో వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి త‌న‌కు రూ. 2కోట్లు ఇవ్వాల‌ని, లేదంటే…

AP

వెలుగులోకి వస్తోన్న రౌడీషీటర్ శ్రీకాంత్ హిస్టరీ..

అతడో కరడుగట్టిన నేరగాడు. హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక సమయంలో జైలు నుంచి పారి పోయాడు. నాలుగున్నరేళ్లుగా బయటే ఉండి నేర సామ్రాజ్యం విస్తరించాడు. హత్యలు, దాడులు, కిడ్నాపులు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్.. ఇలా అతడు చేయని నేరం లేదు. 4 జిల్లాల పరిధిలో సుమారు 200 మందితో ఒక గ్యాంగు ఏర్పాటు చేసుకున్నాడు.   జైల్లో ఖైదీగా ఉంటూ.. జైలర్ ఎవరుండాలో కూడా డిసైడ్.. ఏ కాంట్రాక్టు పనికి…