చెత్త బండిలో మృతదేహం తరలింపు వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్
పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మరణించిన కె. రాధమ్మ (65) అనే వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు కావాలనే వక్రీకరించాయని, వాస్తవానికి అక్కడ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ నివేదికను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాధమ్మ మరణించిన తర్వాత, మృతదేహాన్ని…

