తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ బాస్ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న పోలీస్ సేవలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. తనిఖీలో భాగంగా స్థానిక…

