రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్ట్..?
ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిలో ఇప్పటికే కీలక ప్రాజెక్టుల్ని తెరపైకి తెస్తున్న ప్రభుత్వం.. వాటిని గ్రౌండ్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్నీ ప్రతిపాదిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ అమరావతి రాజధానిలో సెమీ హైస్పీడ్ సర్కులర్ రైల్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే విజయవాడ-గుంటూరు నగరాలను కలుపుతూ…