రామానాయుడు స్టూడియోలో సత్యదేవ్ ‘SD15’ ప్రారంభం: ఫరియా అబ్దుల్లా హీరోయిన్!
వెర్సటైల్ నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా తన 15వ చిత్రాన్ని (SD15) బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యువ నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్రిషూల్ విజినరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’…

