అందుబాటులోకి రానున్న ‘పాన్ 2.0’..
దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా సంఖ్య) సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘పాన్ 2.0’ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రస్తుతం మూడు వేర్వేరు పోర్టళ్లలో అందుబాటులో ఉన్న ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్‌ట్రీకి అప్పగించినట్లు ఓ ఉన్నతాధికారి సోమవారం వెల్లడించారు.…

