National

National

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణకు ‘నో’ చెప్పిన సుప్రీంకోర్టు..!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల నియంత్రణ.. రాయితీలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ కు చెందిన 22ఏళ్ల పిటిషనర్.. 2025 నీట్ యూజీ పరీక్షలకు హాజరయ్యాడు. సదరు అభ్యర్థి జనరల్ కేటగిరీకి చెందిన వాడైనా ఆర్థికంగా వెనకబడిన తరగతి (ఈడబ్ల్యుఎస్)కి చెందిన వాడన్న సర్టిఫికెట్ ఉంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులు 18.9లక్షల నుంచి 25లక్షల వరకు ఉండటంతో…

National

అంతా అయిపోయింది… అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్..

తమిళనాడు శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో తీవ్ర వాదోపవాదాలు, నాటకీయ పరిణామాల మధ్య అట్టుడికింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష డీఎంకే మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.   శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, డీఎంకే పార్టీ పేరుతో అక్రమంగా నిధులు సేకరిస్తోందని ఆరోపించడంతో పాటు, అవినీతికి పాల్పడిన వారిని తమ…

National

భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం..

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో మరో కీలక ముందడుగు పడింది. భారత సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే రెండు రక్షణ ఒప్పందాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మొత్తం 428.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,700 కోట్లు) విలువైన ఈ ప్యాకేజీలు భారత ఆర్టిలరీ, వైమానిక దళాల నిర్వహణ సామర్థ్యాలను పెంచనున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది.   అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (డీఎస్‌సీఏ) ఈ ప్రతిపాదనలను…

National

ఎల్ఓసీ వద్ద అరుదైన దృశ్యం.. కరచాలనం చేసుకున్న భారత్, పాక్ సైనికాధికారులు..

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఓ అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని భారత సైన్యం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య ఏ రంగంలోనూ, ఏ స్థాయిలోనూ కరచాలనాలు లేకపోవడం తెలిసిందే.   పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌కు…

National

విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి..!

భారత వ్యవసాయ రంగంలో ఒక కీలకమైన మైలురాయి నమోదైంది. విత్తన నాణ్యతను మెరుగుపరిచి, పంట దిగుబడిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ‘స్మార్ట్ సీడ్ కోటింగ్’ సాంకేతికతను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆవిష్కరించింది. ఈ బయోపాలిమర్ ఆధారిత టెక్నాలజీ ద్వారా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో 30 శాతం వరకు అదనపు దిగుబడి సాధించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఈ నూతన విధానాన్ని…

National

కేంద్రం ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ చేపట్టనుందా..?

‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ జారీ చేసినట్లు ప్రచారంలో ఉన్న ఆ పత్రం పూర్తిగా నకిలీదేనని తేల్చిచెప్పింది. ఆ లేఖకు కేంద్ర రక్షణ శాఖతో గానీ, ప్రభుత్వంతో గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.   పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ మేరకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ప్రకటన విడుదల చేసింది.…

National

దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం..

రైతులకు, వ్యవసాయ రంగానికి ఆందోళన కలిగించే ఒక కీలక అప్‌డేట్ వాతావరణ శాఖ నుండి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దేశంలోని దాదాపు 12 రాష్ట్రాలపై ‘ఎల్ నినో’ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఖరీఫ్ 2026 సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.   ఎల్ నినో…

National

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి..!

యువతలో ఆన్‌లైన్‌లో సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.   నీట్ పేపర్ లీక్, దేశంలో నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై సీజేపీ…

National

ఉత్తరప్రదేశ్‌లో ఘోర అఘాయిత్యం..! తాతతో బైక్‌పై వెళ్తుండగా ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. అత్యాచారం..

ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఐదేళ్ల పసికందుపై జరిగిన ఘోర అఘాయిత్యం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న బాలికను అపహరించి, అత్యాచారానికి ఒడిగట్టిన ఒక కామాంధుడిని బలియా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే స్పందించిన పోలీసులు, బాలికను రక్షించి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 11 రాత్రి బాన్సడీ రోడ్డు కూడలి దాటిన తర్వాత ఓ కోల్డ్…

National

మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చి వివాదానికి తెరలేపారు. ఔరంగజేబు, మోదీ ఇద్దరూ ఒకే గడ్డపై పుట్టారని వ్యాఖ్యానించారు.   శనివారం పుణెలో జరిగిన విలేకరుల సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “ఔరంగజేబు ఏ మట్టిలో అయితే పుట్టాడో, మోదీ కూడా అదే మట్టిలో పుట్టారు. ఔరంగజేబు గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించారు కదా?” అని వ్యాఖ్యానించారు.…