లక్షల కోట్ల అప్పుతో రాజధానా..? అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు..
ఏపీ రాజధాని అంశంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. టీడీపీ ప్రతిపాదించిన అమరావతి నమూనాతో పాటు వైసీపీ ప్రస్తావించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ, ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఢిల్లీ నిర్మాణం గురించి విజయసాయి రెడ్డి విశ్లేషిస్తూ.. “1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల (సుమారు 10,550 ఎకరాలు) విస్తీర్ణంలో…

