National

National

‘వందేమాతరం’ను అవమానిస్తే ఇకపై శిక్ష.. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం..

జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని శిక్షార్హ నేరంగా ప్రకటించే ‘జాతీయ గౌరవానికి అవమాన నిరోధక (సవరణ) బిల్లు-2026’కు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జాతీయ జెండా, జాతీయ గీతానికి ఉన్న చట్టపరమైన రక్షణను ఇకపై వందేమాతరానికీ వర్తింపజేయనున్నారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఎగువ సభ దీన్ని ఆమోదించింది.   బిల్లుపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభకు రావాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.…

National

కృత్రిమ సూర్యుడి దిశగా చైనా..!

అపరిమితమైన, స్వచ్ఛమైన ఇంధనాన్ని సృష్టించే లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. అణు సంలీన రియాక్టర్ కోసం రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ మాగ్నెట్‌ను చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. భవిష్యత్తులో ఫ్యూజన్ ఎనర్జీని సాధించే దిశగా ఇది అత్యంత కీలకమైన ఇంజినీరింగ్ విజయమని నిపుణులు అభివర్ణిస్తున్నారు.   చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ (ఏఎస్ఐపీపీ) శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.…

National

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ..! రూ.10, రూ.20 నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

దేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.   ఈ ప్రయోగాల్లో భాగంగా రూ. 10, రూ.…

National

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పుకు దారితీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం, ఆయన స్థానంలో సీనియర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.   నీట్ పేపర్ లీక్…

National

రాజకీయాల్లోకి ‘కాక్రోచ్’ పార్టీ..?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాతో ముగిశాయి. నిరసనలకు నాయకత్వం వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటం ముగిసింది. అయితే, ఈ విజయం తర్వాత సీజేపీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందా? అనే చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   ఈ పరిణామాల అనంతరం ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన…

National

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ..

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా, జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని శుక్రవారం వెల్లడించారు.   ఇదే సమయంలో, లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సీనియర్…

National

ఎప్పుడైనా రండి.. చర్చలకు మేం రెడీ.. సీజేపీకి కేంద్ర మంత్రి ఆహ్వానం..!

నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు నిరసనకారులతో మాట్లాడేందుకు ముందడుగు వేసింది.   నిరసనకారులకు కేంద్రం ఆఫర్   ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులకు చర్చల పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆందోళనకారులకు అనుకూలమైన…

National

పార్లమెంటులో నీట్‌పై చర్చిద్దాం.. విపక్షాలకు కేంద్రం పిలుపు..

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై సభలో పారదర్శకంగా చర్చించడం ద్వారా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించవచ్చని ఆకాంక్షించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.   విద్యార్థుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని…

National

మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ భేటీ..

నీట్ పరీక్ష అక్రమాలు, విద్యార్థులపై లాఠీచార్జి అంశాలపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. లోక్ కల్యాణ్ మార్గ్లఓ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. నిరసన ఉద్రిక్తతల నడుమ చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   వివరాల్లోకి వెళితే, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర…

National

ఢిల్లీలో హింసాత్మక నిరసనలు.. 5 ఎఫ్ఐఆర్‌ల నమోదు..

నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అవకతవకల అంశం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మద్దతుదారులు, విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నేడు ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. నిన్న‌ జరిగిన ఈ ఆందోళనల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.   వివరాల్లోకి వెళితే.. నీట్ పేపర్ లీకేజీ…