National

NationalTELANGANA

వచ్చేస్తోంది బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్‌కు 3 కొత్త కారిడార్లు..!

భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్‌) కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి సర్వీసును నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గంగా నిలవనుంది.   508…

APNationalTELANGANA

వియత్నాంలో ఘోర ప్రమాదం..!15 మంది మృతి..

వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్‌ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.   ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్‌ బోటులో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్…

National

బెంచ్‌పైకి కాగితాలు విసిరి.. సుప్రీంకోర్టులో పిటిషనర్ వీరంగం..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ హద్దులు మీరు ప్రవర్తించాడు. న్యాయమూర్తులపై దూషణలకు దిగడమే కాకుండా, కేసు పత్రాలను వారి వైపు విసిరికొట్టి తీవ్ర గందరగోళం సృష్టించాడు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా అధికారులు అతడిని కోర్టు హాలు నుంచి బలవంతంగా బయటకు పంపించారు.   అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్,…

National

ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్‌ సంచలన ప్రకటన..

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతోందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గత రాత్రి భారీ దాడులు నిర్వహించామని తెలిపారు. అవసరమైతే మరోసారి కూడా అదే స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్‌ తీరుతెన్నులు మారకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.   టర్కీలోని అంకారాలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని ప్రస్తావించారు. గత రాత్రి తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించామని, అవసరమైతే ఈ…

National

‘ఉగ్రం’ రైఫిల్‌కు కేంద్రం పచ్చజెండా..!

రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో మరో కీలక ముందడుగు పడింది. తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ద్విప డిఫెన్స్’ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 7.62×51 ఎంఎం ‘ఉగ్రం’ అసాల్ట్ రైఫిల్, భారత సైన్యం మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నిర్వహించిన కఠిన పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించింది. ఈ ఫలితంతో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల (సీఏపీఎఫ్) అమ్ములపొదిలోకి ఈ స్వదేశీ ఆయుధం చేరేందుకు మార్గం సుగమమైంది.   రక్షణ పరిశోధన మరియు…

National

రామ మందిర విరాళాల కేసులో సంచలన విషయాలు..! తెలిస్తే షాక్ అవుతారు ..

అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టైన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాశ్ శుక్లాను పోలీసులు విచారించారు. చోరీ చేసిన నగదును ముందుగా మరుగుదొడ్లలో దాచేవాళ్లమని, తర్వాత అవకాశం చూసుకుని బయటకు తరలించేవాళ్లమని చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఆలయ ట్రస్టీ అనిల్‌ మిశ్రా కీలక పాత్ర పోషించేవారని కూడా అవినాశ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు.…

National

వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కేంద్రం హెచ్చరిక..!

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ ప్రొఫైల్స్‌తో ఇతరులను మోసగించడం (ఇంపర్సొనేషన్) వంటివి పెరిగే అవకాశం ఉందంటూ ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు బుధవారం వెలువడిన పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.   వాట్సాప్ ఈ యూజర్‌నేమ్ ఫీచర్‌ను జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. దీనివల్ల వినియోగదారులు తమ…

National

సీఎం విజయ్‌ ఖాళీ చేసిన స్థానం నుంచి పోటీ..! క్లారిటీ ఇచ్చిన లారెన్స్‌..

తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ప్రచారానికి నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తెరదించారు. ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని పార్టీ తరఫున తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.   ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో లారెన్స్‌ కొత్త వీడియో విడుదల చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన తల్లి, సన్నిహితులు, తన సేవా సంస్థ సభ్యుల…

National

అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్రముప్పు..! కేంద్రం హై అలర్ట్‌..!!

జులై 3న ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్ర నేపథ్యంలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో యాత్ర మార్గమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.   నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రాంతాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు…

NationalTechnology

టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం..! మెటా నుంచి సరికొత్త ‘బ్రెయిన్ రీడింగ్’ టెక్నాలజీ..!

టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం చోటుచేసుకుంది. టెక్ దిగ్గజం మెటా మన మెదడులోని ఆలోచనలను నేరుగా చదివి, వాటిని అక్షర రూపంలోకి మార్చే ఒక విప్లవాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను ఆవిష్కరించింది. ‘బ్రెయిన్2క్వెర్టీ v2’ (Brain2Qwerty v2) పేరుతో పిలుస్తున్న ఈ టెక్నాలజీకి ఎలాంటి సర్జరీ లేదా ఇంప్లాంట్లు అవసరం లేకపోవడం అతిపెద్ద విశేషం. పక్షవాతం, మెదడుకు గాయాలు, ఇతర కారణాల వల్ల మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి ఈ టెక్నాలజీ ఒక వరంలా మారనుంది.…