మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ భేటీ..
నీట్ పరీక్ష అక్రమాలు, విద్యార్థులపై లాఠీచార్జి అంశాలపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. లోక్ కల్యాణ్ మార్గ్లఓ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కలుసుకుని కొద్దిసేపు మాట్లాడారు. నిరసన ఉద్రిక్తతల నడుమ చోటుచేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని నరేంద్ర…

