National

National

ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం.. నాణ్యతా లోపాలే కారణం..

ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్లు ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, లాల్జీ గోధూ కంపెనీలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలు విక్రయిస్తున్న కాంపౌండెడ్ ఇంగువ (హింగ్ పౌడర్) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, వాటి అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’…

National

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు..

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సుమోటోగా పోలీసులు FIR నమోదు చేసారు. కోల్‌కతాలోని క్యాథడ్రల్ రోడ్డులో తృణమూల్ ఛాత్ర పరిషత్ ప్రభుత్వ (TMCP) వ్యవస్థాపక దినోత్సవ సభ జరిగింది. దీంతో ఈ సభకు సంబంధించి కొన్ని షరతులును కోల్‌కతా హైకోర్టు విదించింది. రోడ్డులో ఒక వైపు ట్రాఫిక్ కోసం ఖాళీగా ఉంచాలని, కేవలం 1,500 మంది మాత్రమే సభకు హాజరుకావాలని కోర్టు తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించి రోడ్డును పూర్తిగా మూసివేశారని, అనుమతించిన పరిమితికి…

National

నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు..!

నేపాల్ వరదల్లో ఇప్పటి వరకు దాదాపుగా 320 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారతీయులకు సహాయం అందించేందుకు 24 గంటలపాటు పనిచేస్తున్నామని తెలిపింది. వందమంది భారత మూలాలు ఉన్నవారు కూడా గల్లంతయ్యారని, 400 మంది భారతీయులు చైనాలో నిలిచిపోయారని తెలిపింది. నేపాల్‌కు మరింత సహాయక సామాగ్రిని నేపాల్‌కు పంపుతున్నాము. చైనాలో చిక్కుకున్న 96 మంది భారతీయులు నేపాల్‌కి చేరుకున్నారని తెలిపింది. నేపాల్‌లో చిక్కుకున్న వారిని త్వరలో భారత్ తరలిస్తామని, తమిళనాడుకు చెందిన…

National

నేపాల్ జల ప్రళయం.. 288 మంది భారతీయులు మిస్సింగ్..!

నేపాల్ అకస్మిక వరదల్లో 200 మందికి పైగా భారతీయుల ఆచూకి మిస్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రసూవా జిల్లాలో మెుత్తం 288 మంది భారతీయుల ఆచూకి తెలియరాలేదన్న ఆయన.. మరో 21 మందిని మాత్రం గుర్తించి సురక్షితంగా కాపాడినట్లు తెలిపారు. గల్లంతైన వారితో పాటు బాధితుల యోగ క్షేమాల కోసం నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా రసువా ప్రాంతంలో…

National

నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికుల గల్లంతు.. తీవ్ర ఆందోళన..

హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన జల ప్రళయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది బృందంలోని 140 మంది ఆచూకీ తెలియకపోవడమే ఇందుకు కారణం. భోటేకోశీ నదికి బుధవారం ఆకస్మికంగా పోటెత్తిన వరదల కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 95 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారని ప్రాథమిక సమాచారం అందుతోంది.వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు టూర్ ఏజెన్సీ…

National

తొలిసారిగా మహిళలకు కమాండో శిక్షణ.. ఎన్ఎస్‌జీ కీలక ముందడుగు..

భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాట విభాగంలో మహిళల కార్యాచరణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జీ) చారిత్రాత్మక ముందడుగు వేసింది. తొలిసారిగా వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) మహిళా సిబ్బంది కోసం హర్యానాలోని మానేసర్‌లోని ఎన్ఎస్‌జీ శిక్షణా అకాడమీలో ‘మహిళా కమాండో కన్వర్షన్ కోర్సు’ (ఎంసీసీసీ)ను ప్రారంభించింది.నారీశక్తి సాధికారతలో ఇదొక నూతన అధ్యాయమని ఎన్ఎస్‌జీ పేర్కొంది. ‘సాహసవంతులే నాయకత్వం వహిస్తారు’ (She Who Dares, Leads) అనే…

National

కేంద్రంపై సీజేపీ ఆగ్రహం..! సెప్టెంబర్ 5న మరోసారి భారీ నిరసనకు పిలుపు..!

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, సెప్టెంబర్ 5న ఢిల్లీలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ పరీక్షల నేపథ్యంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించింది.ఈ నిరసన ర్యాలీ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ నుండి ఢిల్లీలోని నూతన పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ వరకు…

National

బీజేపీ కొత్త టీమ్‌తో ప్రధాని మోదీ భేటీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నూతన జాతీయ పదాధికారులతో సమావేశమయ్యారు. కొత్త ఆలోచనలు, దృక్పథాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలతో పార్టీకి ఉన్న సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సంస్థాగత సమావేశాలు ఇలాంటి కొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఫొటోలను పంచుకున్నారు. “సంస్థాగత సమావేశాలు పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజలతో సంబంధాలు…

National

చక్కెర ధరల పెరుగుదల..! కేంద్రం క్లారిటీ..!

చక్కర ధరల పెరుగుదలపై కేంద్రం ప్రభుత్వం స్పందించింది. భారత్‌లో ఇప్పటికే భారీగా చక్కెర ధరలు పెరిగాయి. దీంతో జూలై 20న కిలో చక్కెర ధర దాదాపుగా రూ.48.18 పలికింది. దీంతో ఆగస్టు 20న రూ.55.70కి చక్కెర ధర పెగింది. కేవలం నెల రోజుల్లో కిలో చక్కెరపై రూ.7.52 పెరిగింది. చక్కెర ధరల పెరుగుదలపై కేంద్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండేలా కేంద్రం చర్యలు తీసకుందని తెలిపింది. ఇథనాల్‌కు చక్కెర మళ్లించడం…

National

ఆవేశంలో అలా అన్నాను.. ఆర్మీకి క్షమాపణ చెప్పిన లడఖ్ ‘వి ఆర్ జెన్-జీ’ యువతి..

లడఖ్‌లో ‘వీ ఆర్ జెన్ జీ’ అంటూ భారత సైనికులతో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, భారత సైన్యం, జమ్మూ కశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది. సదరు వీడియో వైరల్ అయిన అనంతరం తొలిసారిగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించింది.లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న క్రమంలో, కార్గిల్…