దేవుడికి కానుకగా వెండి రివాల్వర్..!
రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌లోని ప్రసిద్ధ సావరియా సేఠ్ పుణ్యక్షేత్రంలోని శ్రీకృష్ణుడికి ఓ అజ్ఞాత భక్తుడు వింత కానుక సమర్పించాడు. వెండి రివాల్వర్, తుపాకీ గుండ్లను దేవుడికి కానుక ఇచ్చాడు. ఈ రెండూ కలిపి దాదాపు అరకిలో బరువు ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు రెండు వెండి వెల్లుల్లిపాయలను కూడా ఆ భక్తుడు దేవుడి హుండీలో వేసినట్లు తెలిపారు. అయితే, దేవునికి ఓ ఆయుధాన్ని కానుకగా సమర్పించడం ఇదే మొదటిసారి అని ఆలయ ఛైర్మన్ జానకీదాస్…

