భారత్ సొంత స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీకి గ్రీన్ సిగ్నల్..!
భారత రక్షణ రంగం మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగానే అత్యాధునిక ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను తయారు చేసుకునే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. చైనా తన వైమానిక శక్తిని వేగంగా విస్తరించుకోవడమే కాకుండా, పాకిస్థాన్‌కు కూడా అత్యాధునిక యుద్ధ విమానాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సరికొత్త యుద్ధ విమానం రెండు ఇంజన్లతో, ఐదో తరం (ఫిఫ్త్…

