ఎన్నికలు అయిపోయాయి.. ధరల బాదుడు షురూ.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయని.. సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడబోతోందని ఆయన హెచ్చరించారు. “ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ మొదలవుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలను మోదీ ప్రభుత్వం తన జేబులో వేసుకుందని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై…

