మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే.. విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఫైర్..!
భారత రాజకీయాల్లో మహిళలకు చారిత్రక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్’ సవరణను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు “గర్భంలోనే చంపేశాయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభలో ఈ బిల్లు వీగిపోవడంపై శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత మహిళల ఆకాంక్షలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ చారిత్రక తప్పిదంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే పక్షాలదే ప్రధాన పాపమని నేరుగా…

