అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారు: మంత్రి సీతక్క..
తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై బురద చల్లుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యల విషయంలో కేంద్రం బాధ్యతను పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూరియా సరఫరా అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.…