పహల్గాం ఉగ్రదాడి… ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ అత్యవసర భేటీ..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోదీ… ఎయిర్‌పోర్టులోనే అత్యవసర భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో సమావేశమై…

