మా బంధం దౌత్యానికి మించినది.. సింగపూర్పై మోదీ కీలక వ్యాఖ్యలు..
భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాదని, ఇరు దేశాల భాగస్వామ్యం సాంప్రదాయ రంగాలను దాటి అత్యాధునిక సాంకేతిక రంగాల వైపు శరవేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో కలిసి గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా, శాంతి, శ్రేయస్సు అనే ఉమ్మడి దార్శనికతతో ముందుకు సాగుతున్నాయని మోదీ అన్నారు. …