పాక్ ఏజెంట్ కు పెళ్లి ప్రపోజల్ చేసిన యూట్యూబర్ జ్యోతి..!
దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తోంది. గత వారం అదుపులోకి తీసుకున్న జ్యోతి మల్హోత్రాను అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు…

