పాక్ కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) హాట్‌లైన్‌లో చర్చలు జరిపారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం పదేపదే రెచ్చగొట్టే విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని భారత్ ఈ సందర్భంగా పాక్‌ను గట్టిగా హెచ్చరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. గత ఆరు రోజులుగా…

