మయన్మార్, థాయ్‌లాండ్‌లో పెను విపత్తు… 1000 దాటిన మృతుల సంఖ్య..
మయన్మార్, థాయ్‌లాండ్‌లను శుక్రవారం నాడు రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఒక్క మయన్మార్‌లోనే 1002 మంది చనిపోయినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు తెలిపారు. మరో 2,370 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది రక్షించి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే…

