దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం అవసరంలేదు!: సుప్రీంకోర్టుకు కేంద్రం..
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవిత కాల నిషేధం చాలా కఠినమైనదని, ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత సరిపోతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల నిషేధం సరిపోదని, క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా…

