ఉత్తరప్రదేశ్‌లో కుల రాజకీయాలకు చెక్.. సమావేశాలపై నిషేధం..!
ఉత్తరప్రదేశ్‌లో కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. సమాజంలో కుల ప్రస్తావనలకు తావులేకుండా చేసేందుకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై పోలీసు రికార్డులు మొదలుకొని వాహనాలపై రాసే నినాదాల వరకు ఎక్కడా కులం కనిపించకూడదని స్పష్టం చేస్తూ జిల్లా అధికారులకు ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా…

