రామజ్యోతి వెలిగించిన ప్రధాని మోడీ..
చారిత్రక అయోధ్యలో సోమవారం మధ్యాహ్నం రామమందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకను పురస్కరించుకుని రాత్రికి ఇళ్లలో దీపాలు వెలిగించాలని.. దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ.. దీపాలు వెలిగించారు. శ్రీరాముడి చిత్రపటానికి హారతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రామజ్యోతి(Ram Jyoti) అంటూ మోడీ పేర్కొన్నారు. రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట…

