చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల..
పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో చమురు సహా అన్ని సరుకుల రవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. హౌతీలను నిలువరించే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్ యెమెన్‌లో వారి స్థావరాలపై ప్రతి దాడులు చేశాయి. పశ్చిమదేశాల సైనిక చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు హూంకరిస్తున్నారు. ఈ నేప్యథంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా చమురు ధరలు 4% పెరిగాయి.…

