బీహార్ సీఎం అభ్యర్థిపై తేల్చిచెప్పిన అమిత్ షా: నితీశ్ కుమార్‌కే మద్దతు, వారసత్వ రాజకీయాలపై విమర్శలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టతనిచ్చారు. బీహార్‌లోని దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి తరపున నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతారని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడంపై విపక్షాలు లేవనెత్తిన అంశానికి ప్రధాని మోదీ ఇటీవల సమాధానం ఇచ్చిన తర్వాత, తాజాగా అమిత్ షా కూడా ఇదే…

