బాహుబలి విగ్రహం కాదని నిర్మాత ఆగ్రహం, మ్యూజియం నుంచి ప్రభాస్ విగ్రహం ఔట్!
బెంగళూరు/మైసూరు: బాహుబలి సినిమా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాహుబలిగా (baahubali) ప్రభాస్ (prabhas) నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బాహుబలి మైనపు విగ్రహం వివాదంలో ఉంది. బాహుబలి సినిమా నిర్మాత అభ్యంతరంతో బాహుబలి మైనపు బొమ్మను మ్యూజియం నుంచి తొలగించారు. మైసూరులోని చాముండి కొండ దిగువన చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంది. చాలా మంది ప్రముఖఉలు, సినీ ప్రముఖుల విగ్రహాలు తయారు చేసి ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. ఈ…

