మోదీ-జిన్‌పింగ్ భేటీ.. సరిహద్దు వివాదంపై చర్చలు..
భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమవుతోంది. చైనాలోని టియాంజిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం భేటీ కానున్నారు. పది నెలల విరామం తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన…

