సూరత్‌లో రూ.25 కోట్ల విలువైన వజ్రాల చోరీ..
గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ వజ్రాల చోరీ కలకలం సృష్టించింది. ప్రముఖ డైమండ్ కంపెనీ డీకే అండ్ సన్స్ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగులు సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను అపహరించారు. ఈ సంఘటన కపోద్రా ప్రాంతంలోని కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కంపెనీకి మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో మూసివేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న దుండగులు…

