కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా..
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఈ భూములకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే, కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూములను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) అప్పగించింది. ఈ భూములను అభివృద్ధి చేసి,…