కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్..
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి స్వార్థమే కారణమని మండిపడుతూ, దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ప్రాణహిత నుంచి కాళేశ్వరం దాకా.. అంచనాల పెంపు వైఎస్సార్ హయాంలో 16.40 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తక్కువ అంచనా వ్యయంతో (రూ. 39 వేలు)…

