వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్-జీ తరం ఓటర్లే కీలక పాత్ర-: కేటీఆర్..
వచ్చే ఎన్నికల్లో 50 శాతానికి పైగా జెన్-జీ తరం ఓటర్లే కీలక పాత్ర పోషించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల నీట్ పరీక్ష వైఫల్యంపై జరిగిన పోరులో ‘ఇన్‌స్టా పిల్లలు’ విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మారుతున్న రాజకీయ సమీకరణాలు, యువతరం ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “యువతరం సరికొత్త రీతిలో ఢిల్లీలో కదం తొక్కింది. ఎవరితోనైతే ఘర్షణకు వెళ్లకూడదో, ప్రధాని మోదీ…

